Tuesday, May 14, 2024

జియో 5జీ వచ్చేస్తుంది..!

ఇండియాలో 5జీ నెట్వర్క్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారంతా. ఇప్పటికే మార్కెట్‌లోకి 5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. 5జీ నెట్వర్క్ వస్తుందన్న ముందుచూపుతో యూజర్లు 5జీ స్మార్ట్‌ఫోన్లు కొంటున్నారు. జియో 5జీ నెట్వర్క్ తీసుకొస్తామని ముకేష్ అంబానీ గతేడాది ప్రకటించడంతో జియో 5జీపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే త్వరలో జియో 5జీ నెట్వర్క్ తీసుకొస్తామని రిలెయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ తాజాగా ప్రకటించారు.

100 శాతం ఇండియాలోనే తయారైన జియో 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని ప్రకటించారు. ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతం అందుకున్నట్టు ప్రకటించారు. జియో 5జీ నెట్వర్క్ లాంఛ్ చేసేందుకు రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చాయని, 5జీ ఫీల్డ్ ట్రయల్స్ కోసం కసరత్తు చేస్తున్నామన్నారు. ఇండియాలో తామే మొదట 5జీ నెట్వర్క్ లాంఛ్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో కూడా 5జీ ఉపయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దీంతో పాటు విద్యారంగంలో కూడా 5జీ సేవల్ని అందిస్తామన్నారు. రిలయెన్స్ ఫౌండేషన్ స్కూళ్లల్లో 5జీ నెట్వర్క్‌ను పరీక్షిస్తున్నామన్నారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంతో తయారు చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్‌ను ప్రకటించారు. కొత్త స్మార్ట్‌ఫోన్‌లో జియో, గూగుల్ ఫీచర్స్, యాప్స్ ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను జియో, గూగుల్ సంయుక్తంగా తయారు చేస్తాయి. సామాన్యుల కోసమే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసినట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement