Monday, May 6, 2024

నష్టాలకు బ్రేక్..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వారాంతంలో మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పటికీ కీలక సూచీల మద్దతు లభించడంతో లాభాల్లోకి దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 642 పాయింట్లు పెరిగి 49,585కి చేరుకుంది. నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి 14,744 వద్ద స్థిరపడింది. రియాల్టీ, కన్జ్యూమర్ గూడ్స్ మినహా అన్ని సూచీలు ఈరోజు లాభపడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్ బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ గా టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, టైటాన్ కంపెనీ లాస్ లోనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement