Monday, April 29, 2024

లాభాల్లో దొడ్ల డెయిరీ, నష్టాల్లో కిమ్స్..

కొత్తగా ఐపీఓకు వచ్చి, వాటాలను విక్రయించిన దొడ్ల డెయిరీ, కిమ్స్ (కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)  ఈ ఉదయం బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టింగ్ అయ్యాయి. రూ. 528కి విక్రయించబడ్డ దొడ్ల ఈక్విటీ, సెషన్ ఆరంభంలోనే భారీగా లాభపడింది. గరిష్ఠంగా రూ. 613 వరకూ వెళ్లిన ఈక్విటీ, ప్రస్తుతం రూ. 602 వద్ద కదలాడుతోంది. ఇక కిమ్స్ ఈక్విటీ విషయానికి వస్తే, రూ. 1,008 ఈక్విటీ ధర కాగా, ఆదిలో లాభాలు అందించి, రూ.1,057 వరకూ వెళ్లిన ధర, ఇప్పుడు రూ. 970 వద్ద కదలాడుతోంది.

ఈ ఉదయం 10.30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 18 పాయింట్లు నష్టపోయి, 52,914 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెషన్ ఆరంభంలో 53వేల మార్క్ ను సూచిక తాకగా, ఆ తరువాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో మార్కెట్ కిందకు జారింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక ఎన్ఎస్ఈ, దాదాపు స్థిరంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement