Thursday, May 2, 2024

గల్లీ రౌడీ…రెడి గా ఉంది!!

ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ ని అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు సందీప్. అందులో గల్లీ రౌడీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కోనవెంకట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కు తొలి కాపీని సిద్ధం చేస్తున్నామని నిర్మాత సత్యనారాయణ అన్నారు. అలాగే కోన వెంకట్ మాట్లాడుతూ దేనికైనా రెడీ తర్వాత నేను నాగేశ్వర్ రెడ్డి కలిసి పనిచేసిన సినిమా ఇది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

అలాగే బాబీ సింహ, వెన్నెల కిషోర్, పోసాని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారని కోన వెంకట్ అమ్మడు. అలాగే సందీప్ కిషన్ మాట్లాడుతూ.. గల్లీ రౌడీ అందరూ కలిసి నవ్వుకునే చిత్రమని ఇందులో మా తాత రౌడీ, మా నాన్న రౌడీ, నాకు రౌడీ అవ్వడం ఇష్టం ఉండదు. కానీ స్కూల్ నుంచి తీసుకొచ్చి రౌడీని చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు సందీప్. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ సినిమాలో నటించడం మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చిందని చెప్పుకొచ్చారు సందీప్. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement