Tuesday, May 14, 2024

ఎల్‌ఐసీలో 20 శాతం తగ్గిన డెత్‌ క్లెయిమ్స్‌..

జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీలో డెత్‌ క్లెయిమ్స్‌ 20 శాతం తగ్గినట్లు సంస్థ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ ప్రభావం తగ్గడమే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోల్చితే మాత్రం ఇంకా క్లెయిమ్స్‌ అధికంగా ఉన్నాయని ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో 7,111 కోట్ల విలువ చేసే డెత్‌ క్లెయిమ్స్‌ అందినట్లు ఆయన చెప్పారు. ఈ సారి 5,743 కోట్లకు ఇవి తగ్గియాని తెలిపారు.

కొవిడ్‌కు ముందు స్థిరంగా ఉన్న డెత్‌ క్లెయిమ్స్‌ , గత రెండు సంవత్సరాల్లో గణనీయంగా పెరిగాయన్నారు. ప్రస్తుత త్రైమాసికంలో క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. కొవిడ్‌కు ముందు స్థితికి వచ్చేందుకు మరో సంవత్సరం పట్టే సూచనలు ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement