Tuesday, May 7, 2024

2030 నాటికి జపాన్‌ కంటే ముందుకు భారత్‌.. మూడో ఆర్ధిక వ్యవస్థగా అవతరణ

భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో జపాన్‌, 4వ స్థానంలో జర్మనీ ఉన్నాయి. 2030 నాటికి జపాన్‌ ఆర్ధిక వ్యవస్థను దాటేసి ఇండియా మూడో స్థానంలోకి వస్తుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ అంచనా వేసింది. ఆ సమయానికి భారత్‌ 7.3 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొంది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసుకున్న భారత్‌, పూర్తి ఆర్ధిక సంవత్సరానికి 6.2-6.3 శాతం మేర వృద్ధి సాధించవచ్చని అంచనా వేసింది. భారత జీడీపీ 2022లో3.5 ట్రిటియన్‌ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఇది 7.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఎస్‌ అండ్‌ పీ పేర్కొంది. దీంతో జపాన్‌ జీడీపీని అధిగమించి మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది.

ప్రస్తుతం 25.5 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. మొత్తం ప్రపంచ జీడీపీలో అమెరికా వాటా 4వ వంతుగా ఉంది. 18 లక్షల కోట్ల డాలర్లలో రెం డో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా చైనా ఉంది. 4.2 లక్షల కోట్ల డాలర్లతో జపాన్‌, 4 లక్షల కోట్ల డాలర్లతో జర్మనీ తరువాత స్థానాల్లో ఉన్నాయి. భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ పేర్కొంది.

దేశంలో మధ్యతరగతి ఆదాయాలు వేగంగా పెరుగుతున్నాయని, దీనివల్ల దేశంలో వినియోగ వస్తువుల వినిమయం పెరగనుందని పేర్కొంది. కన్జూమర్‌ మార్కెట్‌, పారిశ్రామిక రంగం వృద్ధి చెంది, వివిధ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు స్వర్గధామంగా మారనుందని పేర్కొంది. భారత డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కూడా ఇ-కామర్స్‌ వృద్ధికి ఊతం ఇవ్వనుందని, దీంతో రానున్న దశాబ్దంలోఓ భారత రిటైల్‌ కన్జూమర్‌ మార్కెట్‌ ముఖచిత్రం మారనుదని పేర్కొంది.

- Advertisement -

2030 నాటికి 110 కోట్ల మంది జనాభాకు ఇంటర్నెట్‌ అందుబాటులోకి రానుందని పేర్కొంది. రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని అంచనా వేసింది. 2022లో భారత్‌ జీడీపీ బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను దాటేసింది. 2030 జర్మనీ ఆర్ధిక వ్యవస్థను ఇండియా అధిగమిస్తుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement