Friday, May 24, 2024

మార్కెట్‌ లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన సూచీలు

స్టాక్‌మార్కెట్లలో వరసగా ఏడు రోజుల పాటు సాగిన లాభాలకు మంగళవారం నాడు బ్రేక్‌ పడింది. ఉదయం ఊగిసలాట మధ్య ప్ర్రారంభమైన ట్రేడింగ్‌ క్రమంగా నష్టాల్లోకి వెళ్లింది. దీపావళి రోజు జరిగిన మూరత్‌ ట్రేడింగ్‌తో కలిపి వరసగా స్టాక్‌మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. విదేశీ మదుపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి బలహీనపడటం, చమురు ధరలు పెరుగుతుండటం మార్కెట్లను దెబ్బతీసింది. దీనికి తోడు వరస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.

సెన్సెక్స్‌ 287.70 పాయింట్లు నష్టపోయి 59543.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 74.40 పాయింట్లు నష్టపోయి 17656.35 వద్ద ముగిసిం ది. బంగారం 10 గ్రాముల ధర 100 రూపాయలు తగ్గి 50480 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 518 రూపాయలు తగ్గి 57230 వద్ద ట్రేడయ్యింది.

లాభపడిన షేర్లు

- Advertisement -

టెక్‌ మహీంద్రా, మారుతి సుజుకి, ఎల్‌ అండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ , టాటా మోటర్స్‌, సిప్లా, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

నెస్లే ఇండియా, హిందూస్థాన్‌ యూనిలీవర్‌,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement