Wednesday, May 29, 2024

ADB : నకిలీ విత్తనాల తయారీ రాకెట్ గుట్టురట్టు.. రూ. లక్షల విలువైన విత్తనాలు పట్టివేత

ప్రభ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియాలో ఓ గోదాం లో అక్రమంగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. శుక్రవారం మధ్యాహ్నం విజిల్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల రాకెట్ ను బట్ట బయలు చేశారు. దస్నాపూర్ ఏరియాలో ఉన్న గోదాములో నకిలీ పత్తి విత్తనాలను ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తో పాటు మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు.

నకిలీ సీడ్స్ లూజ్ విత్తనాలను గోదాంలో అక్రమార్కులు కూలీల ద్వారా బ్రాండెడ్ కంపెనీల పేరిట విత్తనాల తయారు చేస్తు రైతులకు అంటగడుతున్నారు.ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ బ్రాండెడ్ పేరుతో ప్యాక్ చేసి రైతులను నిలువునా మోసం చేస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. మీనాక్షి ,పాండురంగ, జె16, బోల్ గాడ్,, పుడమి వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేరిట పత్తి ప్యాకెట్లలో నకీలీ విత్తనాల ప్యాక్ చేస్తు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిసింది.
అగ్రికల్చర్ అధికారి పుల్లయ్య, డి.ఎస్.పి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ టాస్క్ ఫోర్స్ గోదాం పై దాడి చేసి లక్షల విలువైన విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

సంఘటన స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి కేసులు నమోదు చేశారు. అమాయక రైతులను ఒరిజినల్ బ్రాండెడ్ బ్రాకెట్ల పేరిట నకిలీ విత్తనాలు అంట కడుతు లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement