Tuesday, May 7, 2024

రూపాయి భారీ పతనం.. ఒక దశలో 80.05కి దిగజారింది

మంగళవారం నాడు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 80.05 రూపాయిలకు పడిపోయింది. ఈ దశలో రూపాయి మరింత పతనం కాకుండా కాపాడేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకుంది. పలు నిర్ణయాలు ప్రకటించడంతో రూపాయి కోలుకుంది. మన దేశ కంపెనీల షేర్లు లాభపడటం కూడా రూపాయి పతనాన్ని కొంత వరకు అడ్డుకున్నాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వరసగా వడ్డీ రేట్లు పెంచడంతో దాని ప్రభావం మన రూపాయిపై తీవ్రంగా పడింది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతతో డాలర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. రూపాయి మారకపు విలువ వరసగా పతనం అవుతూనే ఉంది. ఆర్బీఐ గతంలోనూ కొన్ని చర్యలు ప్రకటించినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోలేదు.

రిజర్వ్‌ బ్యాంక్‌ మంగళవారం నాడు స్పాట్‌, పార్వర్డ్‌ మార్కెట్‌లోనూ జోక్యం చేసుకుంది. ఫలితంగా రూపాయి కొద్దిగా కోలుకుంది. విదేశీ నిధులు వచ్చేలా ఆర్బీఐ తీసుకున్న చర్యలు కూడా కొంతమేర ఫలితాన్ని ఇచ్చాయి. రూపాయి పతనం వల్ల మన దేశ కరెంట్‌ అకౌంట్‌, వాణిజ్యలోటు పెరిగిపోతున్నది. రుపాయి మరింత పతనం కాకుండా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్రూప్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, ఆదిత్యబిర్లా వంటి కంపెనీలు అడ్డుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement