Thursday, April 25, 2024

పేరు పెట్టు.. ప్రైజ్‌ కొట్టు – ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టున్న నాన్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులకు బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగేలా మంచి పేరు సూచించిన వారికి నగదు ప్రైజు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన నాన్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌లను తీసుకురాబోతోంది. ప్రయాణికులకు అందుబాటు రేట్లలో ఉండేలా 30 బెర్తుల సామార్థ్యంతో కూడిన ఈ స్లీపర్‌ కోచ్‌లో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఫ్యాన్‌, విద్యుత్‌ బల్బు ఉంటుంది.

అత్యాధునిక నాన్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌లను తీసుకురాబోతున్న తరుణంలో ప్రయాణికులను ఆకర్షించేలా, ప్రజలను ఆకట్టుకునేలా బ్రాండ్‌ తేవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే స్లీపర్‌ కోచ్‌లకు మంచి పేరు సూచించాలంటూ ఎండీ తిరుమలరావు పేర్కొన్నారు. ఈ నెల 24లోగా తగిన పేరు సూచించిన ఉద్యోగులకు అవార్డు, ప్రజలకు నగదు రివార్డు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement