Tuesday, May 7, 2024

GST | గేమింగ్‌ కంపెనీల నుంచి 14 వేల కోట్ల జీఎస్‌టీ టార్గెట్‌

దేశంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీల నుంచి 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 14,000 కోట్ల రూపాయలు జీఎస్‌టీ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా శనివారం నాడు తెలిపారు. 2023లో ప్రభుత్వం గేమింగ్‌ కంపెనీలపై 28 శాతం జీఎస్‌టీని విధించింది. గేమింగ్‌ కంపెనీల కస్టమర్స్‌ పెట్టే ప్రతి బెట్‌పై ఈ పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది.

1.5 బిలియన్‌ డాలర్ల విలువైన గేమింగ్‌ ఇండస్ట్రీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 28 శాతం జీఎస్‌టీ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని గేమింగ్‌ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆర్ధిక సంవత్సరం మార్చి 31, 2024 నాటికి గేమింగ్‌ కంపెనీల నుంచి 7,500 కోట్లు జీఎస్‌టీ వసూళ్లు అవుతాయని అంచనా చేసినట్లు సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీల నుంచి 3,500 కోట్లు పన్నులు వచ్చినట్లు తెలిపారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలపై జీఎస్‌టీని ఏప్రిల్‌లో సమీక్షించనున్నట్లు తెలిపారు. సమీక్షించడం అంటే పన్ను రేటును తగ్గిస్తామని కాదని ఆయన స్పష్టం చేశారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెలకు సగటును 1.7 లక్షల కోట్ల రూపాయాల జీఎస్‌టీ వసూళ్లు వచ్చాయని, 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెలక సగటున 1.85 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement