Tuesday, May 28, 2024

Adiparvam | మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’.. లేటెస్ట్ అప్‌డేట్ !

మంచు లక్ష్మి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అన్వికా ఆర్ట్స్, ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మిస్తున్నాయి. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా ఈ రూపొందుతున్న ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్‌గా వచ్చిందని చిత్ర బృందం చెబుతుంది. ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న “హనుమాన్” చిత్రం లాగే తమ చిత్రం కూడా సక్సెస్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “నాగలాపురం నాగమ్మ”గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడబోతున్నట్లు డైరెక్ట‌ర్ సంజీవ్ తెలిపారు.

కాగా, ఈ సినిమాలో ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, వెంకట్ కిరణ్, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమా గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందని ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ చాలా బాగుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ తెలిపారు. ఈ సినిమాలో నాగమ్మగా నటించిన మంచు లక్ష్మి.. ఎంతో రిస్క్ చేసి రెండు అద్భుతమైన ఫైట్స్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement