Tuesday, June 25, 2024

TG | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన గంజాయి ముఠా.. ఐదుగురు అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైళ్లలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.15 లక్షల విలువైన 62 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్ మీదుగా రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement