Saturday, July 27, 2024

BRS | మూడు రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ముగింపు వేడుకలను బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రం వచ్చి దశాబ్దికాలం గడుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన దశాబ్ధ ముగింపు వేడుకలు జరగనున్నాయి.

ఇందులో భాగంగా జూన్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 1న రాత్రి 7 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించ‌నున్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పింస్తారు.

అదేరోజున హైదరాబాద్లోని పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ది వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండా, జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement