Sunday, June 23, 2024

ABD | విద్యుదాఘాతంతో ప్రైవేట్ విద్యుత్ వర్కర్ మృతి

భైంసా, (ప్రభ న్యూస్): బైంసా మండలంలోని ఈలేగం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు విద్యుత్ వర్కర్ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. బైంసా రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన సాయినాథ్ (26) ప్రైవేట్ విద్యుత్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

సోమవారం మండలంలోని ఇలేగా నుండి సిరాలకు వెళ్లే విద్యుత్ లైన్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో దానిని సరి చేసేందుకు దేగాంలోని విద్యుత్ సబ్స్టేషన్ లో ఎల్ సి తీసుకొని మరమ్మత్తులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆయనను నిజాంబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. నీ మేరకు మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement