Friday, April 26, 2024

తిరుప‌తిలో వైసీపీ కార్పొరేట‌ర్ రాజ‌మ్మ‌ ధ‌ర్నా

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు నిర్వ‌హించ‌డం చూస్తుంటాం…. అయితే ఏపీలో అధికార పార్టీ కార్పొరేట‌ర్ త‌న భూమి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ధ‌ర్నాకు దిగింది. కొందరు రెవెన్యూ అధికారుల లీలలకు ప్రతిపక్ష పార్టీల నేతలే కాకుండా, అధికార పార్టీకి చెందిన వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రెవెన్యూ అధికారులు చేసిన నిర్వాకాన్ని నిరసిస్తూ తిరుపతి 20వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ రాజమ్మ, ఆమె కుమారుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వెంకట మునిరెడ్డి ధర్నాకు దిగారు. తమ 88 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు ఇతరులకు కట్టబెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం 2016 నుంచి ఆర్డీవో కోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. ఆర్డీవో కోర్టులో పెండింగ్ లో ఉన్న తమ భూమి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇతరులకు రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూమిని తమకు ఇప్పించేంత వరకు ధర్నాను కొనసాగిస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement