Saturday, April 27, 2024

వర్షాలతో రైతుల కంటతడి

గత ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన వరి పంట దశకు చేరుకుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో ఈ వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వారం రోజుల కిందట పంటదశకు చేరుకున్న వరి చేనును కోయడానికి రైతులు సన్నద్ధం అయ్యారు. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట కోయకుండా కొందరు రైతులు వదిలివేశారు. కొందరు రైతులు బాగా పడిందని వరి పంట కోత కోశారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ వరి పంట దెబ్బతింటుందని భయాందోళన చెందుతున్నారు రైతులు. అయితే ఇవే వర్షాలు 4,5 రోజులు కొనసాగితే చేతికి రావాల్సిన వరి గింజ వానపాలు అవుతుందని, ఒక గింజ కూడా ఇంటికి రాదని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఎన్నో వ్యయప్రయాలసకు ఓర్చి పండించిన పంట వానపాలు అవుతుందని రైతులు గుబులు చెందుతున్నారు. ఈ వర్షాలు తగ్గుముఖం పట్టాలని ఆకాశం వైపు చూస్తూ వాన దేవుడిని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement