Saturday, May 4, 2024

సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన…ఎమ్మెల్యే ఎలీజా

జంగారెడ్డిగూడెం రూరల్‌: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీజా పాల్గొని లబ్దిదారులకు దృవీకరణ పత్రాలు అందజేశారు. తొలుత ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ… జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఉండాల్సిన పరిపాలనను గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయికి పరిపాలనను ప్రజలకు ప్రభుత్వం చేరువ చేసిందన్నారు. కుల దృవీకరణ పత్రాలు పొందాలంటే తహసీల్దార్‌ కార్యాలయానికి, పెన్షన్‌ కావాలంటే మండల పరిషత్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, అన్ని రకాల సేవలు ప్రస్తుతం గ్రామంలోని సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో 92 శాతం మందికి అర్బన్‌ ఏరియాలో 82 శాతం మందికి పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని, కొన్ని టెక్నికల్‌ ఇబ్బందులు ఇతర కారణాలవల్ల పథకాలు అందని వారన్నారని, వీరందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం పలు సమస్యలను స్థానికులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, గ్రామంలో ఉన్న మద్యం దుకాణాన్ని వేరొక మార్పించాలని స్థానికులు సమావేశం దృష్టికికి తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, పీఎఎఫ్‌ ఖాతాలు తెరిపించాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్‌ నాగ దుర్గారావు ఎమ్మెల్యేకి వినతి పత్రాన్ని అందజేశారు.

సర్పంచ్‌ యరమాల సత్యవతి, ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, ఎంపీటీసీ పొడపాటి నందిని, మాజీ ఎంపీటీసీ సభ్యులు సత్రం లక్ష్మణరావు, సచివాలయాల మండల కన్వీనర్‌ గురజాల పార్ధశారధి, కోఆప్షన్‌ సభ్యులు లాల్‌ అహ్మద్, సొసైటీ చైర్మన్‌ వీరంకి సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నాయకులు పల్లా గంగాధరరావు, కనికళ్ల ప్రసాద్, సత్రం వెంకట్రావు, బుద్దాల రాజు, బండారు సుబ్బారావు, చీదిరాల నాగేశ్వరరావు, ప్రత్యేకాధికారి రాము, తహశిల్దార్‌ స్లీవజోజి, ఎంపీడీవో కె. కిరణ్‌కుమార్, ఈవోఆర్డీ సునీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement