Wednesday, November 29, 2023

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన మంత్రి అంబటి రాంబాబు

ప్రభ న్యూస్ పోలవరం : గోదావరిలో వరదల ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టుని పరిశీలించారు. మంగళవారం రాత్రికి పోలవరం ప్రాజెక్టు చేరుకున్న మంత్రి రాత్రి ప్రాజెక్టు అతిధి గృహంలో బస చేశారు. బుధవారం మంత్రి తొలుత పోలవరం ప్రాజెక్టు ఎగువ, దిగువ కాపర్ డ్యాం ల నడుమ వస్తున్న సీఫేజీ జలాలు డీవాటరింగ్ ప్రాంతానికి వెళ్లడానికి వేసిన తూరలను పరిశీలించారు. డయాఫ్రంవాల్ సమీపంలో ఇసుక వైబ్రో కాంపాక్షన్ పనులను చూశారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో పడిన భారీ అగాధాలను పూడ్చే పనులను పరిశీలించారు.

- Advertisement -
   

దిగువ కాపర్ డ్యాం వద్ద (డీవాటరింగ్) మోటర్ల ద్వారా నీటిని తోడే పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్ డ్యాం నుండి వస్తున్న సీపీజీ ప్రాంతాలను చుశారు. స్పిల్వేలో రేడియల్ గేట్ల పనితీరుని పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జల వనరుల శాఖ అధికారులు, గుత్తేదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ చీఫ్ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఇ నరసింహమూర్తి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గిరిధర్ రెడ్డి, ఈఈ మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement