Saturday, May 18, 2024

డ్రాపవుట్స్​పై ఫోకస్​ పెట్టాలి.. మూడు రోజుల్లో నివేదిక కావాలి: కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

ఏలూరు, (ప్రభన్యూస్): పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ నివారణ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా విద్యాశాఖాధికారి శ్యాం సుందర్ పాఠశాలల తనిఖీలో భాగంగా బుధవారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఏలూరు నగర పాలక సంస్ధ కస్తూరిబా బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మద్యలో బడిమానేసిన విద్యార్ధుల వివరాలను ఆరా తీశారు. బడిమానేసిన పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతానికి వెళ్లింది వివరాలను వాకబు చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులతో సమీక్షిస్తూ ఎవరైతే పిల్లలు మద్యలో బడిమానివేశారో వారి ఇంటికి నేరుగా వెళ్లి ఆయా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి పాఠశాలల్లో చేర్చేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మూడు రోజుల్లో మద్యలో బడిమానివేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్చడం లేదా వారు ఏ ప్రాంతానికైనా వెళ్లిఉంటే సంబంధిత వివరాలతోకూడిన నివేదికను అందజేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు. మద్యలో బడిమానివేసిన విద్యార్ధుల తల్లిదండ్రులవద్దకు వెళ్లి వారిని చేర్పించే విధంగా ఫోటోతో సహా పంపించాలని అదే విధంగా తల్లిదండ్రులు విద్యార్ధులను బడిలో చేర్పించడానికి ఇబ్బంది కరంగా వ్యవహరిస్తే ఉపాధ్యాయులు ఒక బృందంగా వెళ్లి ఆయా తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి భవిష్యత్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలని అందుకు సంబంధించిన ఫోటోలు కూడా పంపాలని సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement