Tuesday, May 14, 2024

సెన్సార్ ఫార్మాలిటీస్​ కంప్లీట్.. బ్రో మూవీకి క్లీన్ U సర్టిఫికేట్

సముద్రఖని ద‌ర్శ‌క‌త్వంలో పవర్​స్టార్​ పవన్ కళ్యాణ్, సుప్రీమ్​ హీరో సాయి ధరమ్ తేజ్ ఫాంటసీ కామెడీ డ్రామా మూవీ బ్రో. ఈ సినిమా జులై 28వ తేదీన గ్రాండ్​గా రిలీజ్ కానుంది. కాగా, దీనికి సంబంధించిన ప్రమోషన్స్​ని మూవీ టీమ్ ఇప్పటికే ప్రారంభించింది. మ‌రికొన్ని రోజుల్లో సినిమా ట్రైలర్ రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్.

కాగా, ఇవ్వాల‌ సెన్సార్ ఫార్మాలిటీస్​ని క్లియర్ చేసుకుని CBFC నుండి క్లీన్ U సర్టిఫికేట్ ని పొందింది సినిమా. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై టీజీ విశ్వ ప్రసాద్ బ్రోని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement