Saturday, May 4, 2024

23న‌ మహబూబ్ నగర్ ట్యాంక్ బండ్ పై డ్రోన్ షో… .. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, జూలై 19 (ప్రభ న్యూస్): ఆర్ధికంగా అభివృద్ధి సాదించిన అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్వీడన్, నార్వే, స్పెయిన్, సింగపూర్, దుబాయ్, బీజింగ్ లాంటి పట్టణాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, సాంకేతికంగా నిర్వహించే డ్రోన్ షో తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మంగా దేశంలో మొట్టమొదటి సారిగా ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు మహబూబ్ నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏర్పాటు సమయంలో నిర్వహించిన డ్రోన్ షో ను జిల్లాల్లో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ సహకారం తో ప్రపంచం లోని ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో అత్యంత అరుదుగా నిర్వహించే డ్రోన్ షో తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు లో భాగంగా దేశంలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పట్టణం లోని ట్యాంక్ బండ్ పైన ఈ నెల 23న నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మహబూబ్నగర్ పట్టణం లో డ్రోన్ షో నిర్వహించిన అనంతరం దశలవారీగా వివిధ జిల్లా లైనా వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో నిర్వహించ‌నున్నట్లు మంత్రి,   పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి  శైలజ రామాయ్యర్ తో కలిసి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి , టూరిజం డైరెక్టర్  నిఖిల, పర్యాటక శాఖ ఎండి మనోహర్, Botlan Dynamics స్టార్ట్ అప్ కు చెందిన ఆయుష్, భాస్కర్, పర్యాటశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement