Monday, May 6, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్ ను విచారించిన ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ కౌంటర్ దాఖలు చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించింది. స్టీల్ ప్లాంట్ ను లాభాలబాట పట్టించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని కోరింది. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ గురించి ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని తెలిపింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శాసనసభలో సైతం తీర్మానం చేశారని చెప్పింది. అయితే ఈ అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని… అయితే సీఎం లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: మెగా అప్‌డేట్: చిరు బర్త్ డే హంగామా మొదలైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement