Saturday, October 12, 2024

AP | సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు మూడో స్ధానం

విశాఖపట్నం,ప్రభన్యూస్‌: సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు అన్ని మేజర్‌ పోర్టులతో పోడి పడి మూడో స్ధానంలో నిలించింది. 2023 ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జులై నెల వరకూ పోర్టుల పనితీరుపై కేంద్ర పోర్టులు నౌకాయాన జలరవాణా శాఖ కార్యదర్శి సమీక్షను నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ మేజర్‌ పోర్టుల పనితీరుపై కొన్ని కీలకమైన అంశాలను పరిశీలిస్తోంది. ఇందులో సరుకు పరిమాణం (కార్గో వాల్యూమ్‌), ప్రి బెర్తింగ్‌ డిటెన్షన్‌ సమయం, టర్నెరౌండ్‌ సమయం, ఔట్‌ పుట్‌ పర్‌ షిప్‌ బెర్త్‌ డే, ఐడల్‌ టైం ఎట్‌ బెర్త్‌ వంటి అంశాలను మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకుంటోంది.

ఈ అన్ని సూచీలలోనూ విశాఖపట్నం పోర్టు అధారిటీ ప్రగతిని కనబరిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే నిర్ధిష్ట సమయంలో పోర్టు 33.14 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేసి సరుకు పరిమాణంలో 3 శాతం వృద్దిని నమోదు చేసింది. ప్రి బెర్తింగ్‌ డిటెన్షన్‌ లో 65 శాతం, టర్నెరౌండ్‌ సమయంలో 16 శాతం, ఔట్‌ పుట్‌ పర్‌ షిప్‌ బెర్తింగ్‌ డే 14 శాతం, ఐడల్‌ టైం ఎట్‌ బెర్త్‌ 4 శాతం వృద్దిని నమోదు చేసింది.

పోర్టు సాధించిన ప్రగతి పట్ల పోర్టు డిప్యూటీ చైర్‌ పర్సన్‌, విభాగాధిపతులు, సీనియర్‌ అధికారులు, ఉద్యోగులను పోర్టు చైర్‌ పర్సన్‌ డా. ఎం. అంగముత్తు ప్రసంసించారు. పోర్టు ఈ ఘనతను సాధించడంలో మద్దతుగా నిలిచిన పోర్టు భాగస్వాములను (స్టివెడోర్స్‌) చైర్‌ పర్సన్‌ అభినందించారు. ఈ ప్రగతిని కొనసాగించాల్సిందిగా ఆయన సూచించారు. పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్‌ ఈ వివరాలను తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement