Monday, May 20, 2024

75 లక్షల కొత్త ఉజ్వల్‌ యోజన గ్యాస్‌ కనెక్షన్లు..

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) స్కీమ్‌ను కొనసాగించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ స్కీమ్‌ను రానున్న మూడు సంవత్సరాలు 2023-24, 2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరాల్లో కొనసాగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు 1,650 కోట్లు కేటాయించింది. ఈ మూడు సంవత్సరాల్లో 75 లక్షల ఉజ్వల యోజన గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నారు.

ఈ స్కీమ్‌లో ఇచ్చే 14.2 కేజీల సింగిల్‌ సిలిండర్‌ను 2,200 రూపాయలకు, 5కేజీల డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్‌ను 2,200కు, 5 కేజీల సింగిల్‌ సిలిండర్‌ను 1,300కు ఇవ్వనున్నారు. అయితే ఈ స్కీమ్‌లో లబ్దిదారులకు ఈ గ్యాస్‌ కనెక్షన్‌తో పాటు, మొదటి సిలిండర్‌, గ్యాస్‌ స్టౌవ్‌ను ఉచితంగా అందిస్తారు. చమురు కంపెనీలకు ఈ సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో పాటు 14.2 కేజీల సిలిండర్‌పై 200 రూపాయల రాయితీని ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఇస్తారు.

ఇటీవల కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ ధరను 200 రూపాయలు తగ్గించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌లో గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి అప్పటికే ఇస్తున్న 200 రూపాయలకు ఇది అదనం. దీంతో ఈ స్కీమ్‌లో ఉన్న వారికి రాయితీగా మొత్తం 400 రూపాయలు అమలు చేస్తారు.

- Advertisement -

అర్హులైన పేదలకు పీఎంయూవై కింద గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తారు. అనేక కారణాల మూలంగా దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో అర్హులైన పేదలకు ఈ గ్యాస్‌ కనెక్షన్లు అందడంలేదు. 2023, ఆగస్టు 31 నాటికి దేశంలో 15 లక్షల పీఎంయూవై గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. 2016లో ప్రధాన మంత్రి ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. దీని తరువాత దేశంలో గ్యాస్‌ వినియోగం పెరిగిందని ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. మొదటి దశ స్కీమ్‌కు ప్రభుత్వం 8,000 కోట్లు కేటాయించింది. 2021 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్‌ -2ను అమలు చేస్తున్నారు. తాజాగా మూడో దఫా మరో మూడు సంవత్సరాలకు పొడిగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement