Saturday, April 27, 2024

నిధులు కొరతతో నిలిచిపోయిన వేదవతి జలాశయం పనులు… సందిగ్దంలో రైతులు..

కర్నూలు, ప్రభన్యూస్ : పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వేదవతి ప్రాజెక్టుకి నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. ఆలూరు, ఆదోని పరిధిలోని 82వేల ఎకరాలకు సాగునీరు, 21 గ్రామాలకు మంచినీరు అందించే లక్ష్యంతో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం 2019 మార్చిలో శ్రీకారం చుట్టి టెండర్లు పిలిచింది. కొత్త ప్రభుత్వం రీటెండర్లకు వెళ్లగా రూ.1942.80 కోట్లతో చేపడుతున్న పనులు 30 నెలల వ్యవధిలో రెండు జలాశయాలు, మూడు పంప్‌ హౌస్‌లు, గ్రావెట్‌ కెనాల్‌ పూర్తిచేసేలా ఒక కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ పనులు 2021 సెప్టెంబర్‌ 6 నాటికి పూర్తికావాల్సి ఉన్నా కోవిడ్‌ కారణాలతో ముందుకు వెళ్లలేదు. మరో రెండేళ్లపాటు గడువు కోరింది.

భూసేకరణ పరిహారానికి బడ్జెట్‌ నిల్‌…

4781 ఎకరాలు బూర్జుల, మద్దికెర, మొలగవల్లి, పెద్దహోతూరు, ఆలూరు, హాలహర్వి, నేమకల్లు, అమృతాపురం, గూళ్యం, హరికెర పరిధిలో భూసే కరణ చేయాల్సి ఉంది. భూసేకరణ బిల్లులు సిద్దం చేసి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయ యంత్రంగా సీఎస్‌ఎంఎస్‌లో అప్లోడ్‌ చేయడానికి నిధులు కేటాయించిన ప్పుడే అప్లోడ్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మద్దికెర, బూరుజుల పరిధిలో ఎకరా రూ.8లక్షలు, నెట్ర వాటి పరిధిలో ఎకరా రూ.9.20లక్షలచొప్పున పరిహారం ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ధర ఎంత ఇస్తామన్నది కొన్ని గ్రామాల్లో ప్రకటించలేదు. దీంతో భూములను ఇచ్చేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. స్పెషల్‌ డిప్యూటీ కలె క్టర్లు 276 ఎకరాలు సర్వే అవగా, 427 ఎకరాల ఎంజైయిమెంట్‌ సర్వే పూర్తిచేశారు. డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ స్థాయిలో 43.33 ఎకరాలు ఉండగా, అవాడ్‌ స్థాయిలో 17.24ఎకరాలు ఉన్నాయి.

రూ.110కోట్లు రావాల్సి ఉంది…

వేదవతి జలాశయ పనులకు సంబంధించి కొన్ని రోజుల కిందట పంప్‌హౌస్‌ 3 పనులు చేపట్టారు. 80 శాతం పనులు పూర్తికాగా, శ్లాబ్‌ దశలో ఉంది. చిన్నపైపులు 4.96కిలోమీటర్లు పూర్తికాగా, పెద్దపైపులు 3 కిలోమీటర్ల మేర వేశారు. గ్రావెట్‌ కాల్వ 22.67 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా, పనులు మొదలుపెట్టి 800 మీటర్లు పూర్తిచేశారు. గుత్తేదారులు ఇప్పటికే 110కోట్ల బిల్లులు ప్రభుత్వానికి పెట్టారు. నిధులు లేక బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో వేదవతి జలాశయం పనులు ముందుకు సాగడం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement