Sunday, April 28, 2024

వర్సిటీ కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టి వేతనాల పెంపు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేస్తున్న బోధనా సిబ్బంది వేతనాల పెంపుపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, అర్హతలననుసరించి ఈ పెంపు ఉండనుంది. ప్రస్తుతం వారికి నెలకు రూ. 35 వేలు అందిస్తుండగా.. అదనపు క్వాలిఫికేషన్‌గా పీహెచ్‌డీని పూర్తి చేసిన వారికి రూ. 5 వేలు చొప్పున, అలాగే నెట్‌, స్లెట్‌తో పీజీ లేదా పీజీని అందుకు ప్రామాణికంగా తీసుకోనున్నారు.

వర్సిటీల వీసీలు బోధనా సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, సిబ్బంది ఏడాదికి రెండు రిసెర్చ్‌ పేపర్లు పబ్లిష్‌ చేస్తే వారికి రూ. వెయ్యి చొప్పున వేతనం పెరగనుంది. అయితే మొత్తంగా యూజీసీ స్కేల్స్‌ ప్రకారం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు చెల్లించే మినిమమ్‌ టైం స్కేల్‌ దాటకుండా ఈ పెరుగుదల ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement