Wednesday, May 15, 2024

నిరుద్యోగులను ముంచిన సాఫ్ట్‌వేర్‌ కంపనీ.. ఎండీ అమిత్‌ శర్మ కోసం గాలిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉద్యోగాల పేరుతో డిజిటల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపనీని తెరచి నిరుద్యోగులను భారీగా మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌ జాబ్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం, యూఎస్‌ బేస్డ్‌ కంపనీ అంటూ నిర్వాహకులు చీటింగ్‌కు పాల్పడ్డారు. నెలకు మూడు లక్షల రూపాయల వేతనం ఇస్తామని ఆశ చూపిన నిర్వాహకులు ఒక్కో అభ్యర్థు నుంచి అయిదున్నర లక్షల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఆరు నెలల్లో తిరిగి ఇస్తామని నమ్మించి బురిడీ కొట్టించారని పోలీసులు గుర్తించారు.

దాదాపు 700 మంది బాధితుల నుంచి రూ. 30 కోట్ల వరకు డిపాజిట్లను సేకరించిన నిర్వాహకులు ఆ తర్వాత బోర్డు తిప్పేసారు. దీంతో బాధితులంతా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కంపనీ ఎండీ అమిత్‌ శర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement