Friday, May 3, 2024

659 అద్దె బస్సులకు టెండర్లు పిలుపు.. ఈ నెల 27 వరకు అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరోసారి అద్దె బస్సుల నిర్వహణకు ఆర్టీసీ టెండర్లు పిలిచింది. గతంలో 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవగా కేవలం 339 బస్సులకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. దీంతో మరోసారి 659 బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు కోరారు. రోడ్ల కండీషన్‌, డీజిల్‌ రేట్ల పెరుగుదల, ఆర్టీసీ ఇచ్చే రేట్లు గిట్టుబాటు కాకపోవడం తదితర నిబంధనలతో అద్దె బస్సులకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రాలేదు. తిరిగి తాజాగా మరోసారి అధికారులు టెండర్లు పిలిచారు. తొమ్మిది ఏసీ స్టీపర్‌, 47 నాన్‌ ఏసీ స్లీపర్‌, ఆరు ఇంద్ర, 46 సూపర్‌ లగ్జరీ, 22 ఆల్ట్రా డీలక్స్‌, 70 ఎక్స్‌ప్రెస్‌, 208 ఆల్ట్రా పల్లెవెలుగు, 203 పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌, తొమ్మిది సిటీ ఆర్డినరీ బ్సులకు టెండర్లు పిలిచారు. జిల్లాల వారీగా శ్రీకాకుళం 39, పార్వతీపురం మన్యం 32, విజయనగరం 14, విశాఖపట్టణం 61, అనకాపల్లి 22, కాకినాడ 41, తూర్పు గోదావరి 27, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ 39, పశ్చిమ గోదావరి 52, ఏలూరు 21, కృష్ణా 28, ఎన్‌టీఆర్‌ 12, గుంటూరు 26, పల్నాడు 30, బాపట్ల ఆరు, ప్రకాశం 10, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు 39, తిరుపతి 35, చిత్తూరు రెండు, అన్నమయ్య 10, వైఎస్సార్‌ కడప ఆరు, నంద్యాల 29, కర్నూలు 14, అనంతపురం 31, శ్రీసత్యసాయి 33 అద్దె బస్సులు కావాలని ఆయన పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన వారు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ఒ కేఎస్‌ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీ ఉదయం 10గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement