Sunday, April 28, 2024

Telugudesam క్యాండెడేట్లు ఫైనల్​!… అభ్యర్థుల వడపోత పూర్తి

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు క‌స‌ర‌త్తు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగనున్న స్థానాలకు సంబంధించి అభ్యర్ధుల వడపోత ప్రక్రియను దాదాపు పూర్తి చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తూ ‘రా కదలిరా’ పేరిట ప్రచార సభలను నిర్వహిస్తున్న చంద్రబాబు విరామ సమయంలో అభ్యర్ధుల వడపోత ప్రక్రియను పూర్తి చేశారు. దాదాపు 90 నుంచి 95 శాతం అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఐవీఆర్‌ఎస్‌తో పాటు పలు సర్వే సంస్థల నివేదికల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు సొంతంగా పార్టీ నేతలకు కూడా తెలియకుండా అభ్యర్ధుల ఎంపిక.. నియోజకవర్గాల్లో పరిస్థితులపై ప్రత్యేక సర్వేలను చేయించారు. ఇవన్నీ ఓ కొలిక్కి రావడంతో బహిరంగ సభల విరామ సమయంలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే టీడీపీ – జనసేనకు సంబంధించిన అభ్యర్ధుల ఉమ్మడి జాభితాలను ప్రకటించాలని ఆ రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవంగా ఇప్పటికే జాభితా విడుదల పూర్తి కావలసి ఉన్నప్పటికి పలు కారణాలు, అవాంతరాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది.

ఆశావహుల పోరు

మరోవైపు ఆశావాహుల పోరు అధికంగా ఉన్న స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పార్టీకి కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తు రీ సర్వేలను చేయించారు. అలాగె ఐవిఆర్‌ఎస్‌ సర్వేను కూడా చేపట్టి కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకత్వాల అభిప్రాయ సేకరణ చేశారు. నియోజకవర్గంలో ఆయా నేతలకు ఉన్న పట్టు ఇతర అంశాలను పూర్తి స్థాయిలో సేకరించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంకొక వైపు బీజెపీతో పొత్తు అంశం ఖరారు కాకపోవడంతో జాభితా విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. ప్రస్తుత పరిణామాల ప్రకారం మరో రెండు మూడు రోజుల్లోనె బీజెపీతో పొత్తు అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

50 సీట్లతో జాబితా రెడీ

అధికార వైసీపీ ఇప్పటికే 5 విడతలుగా అభ్యర్ధుల ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చింది. బీజేపీతో పొత్తు అంశం కొలిక్కిరాకపోయినా ఇబ్బందులేని స్థానాలతో జనసేన పోటీ చేసే నియోజకవర్గాల జాభితాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 50 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదలకు అవకాశం ఉంది. తొలుత 90 మందితో తొలి లిస్టును ప్రకటించాలని భావించిన టీడీపీ అధిష్టానం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సిట్టింగులతో పాటు మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఇక సామాజిక సమీకరణాలు, నియోజకవర్గాల్లో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులతో తొలి జాభితాను చంద్రబాబు సిద్ద్ధం చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. ఈ జాభితాను పిభ్రవరి 4 లేదా 5వ తేదీన ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం
.
ఎంపీ స్థానాలపైనా… కసరత్తు

- Advertisement -

ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్ధులను ఖరారు చేసే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. తొలి జాభితాలో ఐదు నుంచి ఆరు పార్లమెంటు స్థానాల అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి వచ్చే నెల మొదటి వారంలోనె తొలి జాభితాను విడుదల చేసి ఇటు నేతలు అటు కేడర్‌లో ఉన్న టెన్షన్‌కు రిలీఫ్‌ ఇచ్చె ఆలోచనలో టీడీపీ అధిస్టానం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement