Saturday, April 27, 2024

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్‌జీటీ తీర్పు ఎప్పుడంటే..

Telangana government, National Green Tribunal, NGT, Andhra Pradesh, Rayalaseema Lift Irrigation Scheme, Telugu news, Telugu latest news, Telugu viral news, Telugu breaking news,

ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతలపై మంగళవారం చెన్నైలోని ఎన్‌జీటీలో వాదనలు జరిగాయి. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్‌జీటీకి ఉందని పిటిషనర్ వాదించారు. ఎన్‌జీటీ చట్టం సెక్షన్ 26, 28 కింద చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఈనెల 30న ఏపీ సీఎస్ పదవి వీరమణ చేయబోతున్నారని ఎన్​జీటీకి తెలిపారు. కేసు తప్పుదోవ పట్టించేలా ఏపీ సీఎస్‌ అఫిడవిట్లు వేశారని ఆరోపించారు. ఎన్‌జీటీ అధికారాలపై సుప్రీం తీర్పులు ప్రస్తావించారు. తీర్పు ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈనెల 27న తెలంగాణ వాదనలు వినిపించనుంది. వాదనల అనంతరం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్‌జీటీ తీర్పు ఇవ్వనుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement