Tuesday, May 14, 2024

జగనన్న స్వచ్ఛ సంకల్పంతో.. మార‌నున్న గ్రామాల రూపు రేఖ‌లు..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ప్రారంభమైన స్వచ్ఛ సంకల్పం 10వ రోజు కొన‌సాగుతోంది. నడింపాలెం పంచాయితీ సచివాలయం-1లో మండల స్పెషల్ ఆఫీసర్ వై వి రమేష్ బాబు.. ప్రజా ప్రతినిధులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంత‌రం స్వచ్ఛ సంకల్ప ప్రతిజ్ఞ చేయించి..ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జడ్పిటిసి విప్పాల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ అంబాసిడర్లు వారికి కేటాయించిన ఇళ్ళల్లో వ్యర్ధాలను కలెక్ట్ చేసి తడి, పొడి చెత్త‌ని వేరు చేసుకొని డంపు యార్డ్ కు తరలించాలని సూచించారు.

కాగా ఈ విధానాన్ని అంతటినీ కూడా స్వచ్ఛ సంకల్ప యాప్ లో డౌన్ లోడ్ చేస్తూ గ్రామ పంచాయితీ అధికారుల మన్ననలు పొందాలని కోరారు, ఇటువంటి కార్యక్రమాలకి కూడా వాలెంటర్ల్లు పూర్తి స్థాయిలో హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు, ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు . ఈ కార్యక్రమానికి సర్పంచ్ వాసి మళ్ల రత్నబాబు, సొసైటీ అధ్యక్షులు కట్టా సుబ్బారావు, ఎంపీపీ దాసరి అన్నమ్మ చెంచు రామారావు, ఈ ఓ పి ఆర్ డి ఎం కె ఎస్ గిరిధరరావు, పంచాయతీ సెక్రెటరీ ఎస్ కె ఖాజావలి, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, వాలంటీర్స్, గ్రీన్ అంబాసిడర్, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement