Sunday, April 28, 2024

Breaking: ఏపీలో టెన్త్ హిందీ పేపర్ లీక్!

ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ.. ప్రశ్న పత్రాలు లీక్ అవుతుండడం కలకలం రేపుతోంది. నిన్న నంద్యాల జిల్లాలో పేపర్ లీక్ కాగా.. తాజా శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్ష కేంద్రాలా నుంచి గురువారం హిందీ పరీక్ష పత్రం బయటకు వచ్చినట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముందుగా సోషల్ మీడియాలో ఇది ప్రచారం కావడంతో జిల్లా ఆంతా కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ రొట్టవలస కేంద్రానికి వచ్చి అక్కడ అధికారులతో మాట్లాడారు. దీనిపై పోలీసులు కూడా విచారిస్తున్నారు. అయితే ఈ రెండు కేంద్రాల నుంచి పరీక్ష పత్రం లీక్ కాలేదని, ఎక్కడో జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

కాగా పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయన్న వార్తలు వింటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంటకే పేపర్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేంద్రాల నుంచి పేపర్ లీక్ అయినట్లుగా ఆధారాలు ఏమీ లేవని పోలీస్ లు చెబుతున్నారు.

కాగా, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న తొలిరోజు గ్రామంలో పరీక్షలు ప్రారంభమైన గంటన్నర తరువాత ప్రశ్నాపత్రం లీక్‌ వదంతులు వ్యాపించాయి. ముందుగా అవాస్తమని కొట్టిపారేసిన విద్యాశాఖ, జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విద్యాశాఖ, పోలీసులు కలిసి పాఠశాలలో విచారణ ప్రారంభించడంతో  నిజమని తేలాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement