Wednesday, May 8, 2024

పోలీసుల వలలో ఎర్రచందనం స్మగ్లర్లు.. 13 మంది అరెస్ట్

తిరుపతి సిటీ ( ప్రభ న్యూస్): అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లు ముఠాకి చెందిన 13 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 71 లక్షల రూపాయలు విలువ కలిగిన 21 ఎర్రచందనం దుo గలు. తో పాటు ఒక కారు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా కట్టడికి పటిష్టమైన చర్యలతో పాటు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఆక్రమ రవాణాకు పాల్పడి న సహకరించిన వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.. సమాచారం మేరకు నిఘా ఉంచి భాకరాపేట సిఐ తులసి రామ్, ఎస్సై లు వెంకటేశ్వర్లు, ప్రకాష్ బాబు. సిబ్బంది ఎర్ర వారి పాలెం మండలం బోడెవాండ్లపల్లి గ్రామ సమీపంలో సాయి కాడ గుట్ట వద్ద ఆంజనేయస్వామి గుడి దగ్గర అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే అక్రమ రవాణాకు పట్టుబడిన ముఠా సభ్యులు అనేక పర్యాయాలు శేషాచల అడవుల్లోకి వచ్చి ఎర్రచందనం దుoగలను నరికి వెళ్లివారన్నారు.

వీరిపై కేసులు కూడా ఉన్నాయన్నారు. వీరిలో ఇద్దరు అన్నమయ్య జిల్లాకు చెందినవారు, మిగిలిన పదిమంది తమిళనాడు రాష్ట్ర పరిసర ప్రాంతాలకు చెందిన వారు గుర్తించడం జరిగిందన్నారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న వాహనాలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాహనాలుగా గుర్తించామన్నారు.. అరెస్టయిన వారిలో అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు చెందిన గుండ్ల శంకర్. 42 సంవత్సరాలు. శ్రీకాళహస్తి మండలానికి చెందిన సింహాచలం.ఖంద్రిగా గ్రామానికి చెందిన వేముల శ్రీనివాసులు 34 సంవత్సరాలు. మంగళం బి టి. ఆర్. కాలనీ చెందిన దూదేకుల బాబు సాహెబ్ 42, సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రం తిరునామలై జిల్లా ఊర్గౌందనుర్ గ్రామానికి చెందిన గోవిందంరజమనిక్యం 45 సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా చిన్నుర్ గ్రామానికి చెందిన శివ 27 సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రం. వేలూరు జిల్లా ముల్లువడి గ్రామానికి చెందిన సేవతనాక్తివెల్. 38 సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రం తిరునామలై జిల్లా తితనుర్వీరప్పనుర్ చెందిన సి. కుమార్ 41. సంవత్సరాలు. తిరునామలై జిల్లా. తితనుర్వీరప్పానుర్ చెందిన బి. శివ సంవత్సరాలు. అదే జిల్లాకు చెందిన. కే ముని కంటన్ 26 సంవత్సరాలు. అదే జిల్లాకు చెందిన ఎం సురేష్ 34 సంవత్సరాలు. డి.మహేశ్వరం 24 సంవత్సరాలు. వీరిని అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పరార్ లో ఉన్న అంతరాష్ట్ర స్మగ్లర్లు తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా చెందిన అరసంబట్టు. చెందిన ..తంజి. అలియా స్ సంతోష్. గోవిందరావు. అలియాస్ గోవిందస్వామి. పరారీల్లో ఉన్నారన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపుచర్యలుచేపట్టనున్నట్లు వివరించారు. ఈ కేసు చేదించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన భాకరాపేట సర్కిల్ అధికారులు సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లా అండ్ ఆర్డర్ కులశేఖర్. క్రైమ్ అదనపు. ఎస్పి. విమల కుమారి. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి . సురేంద్ర రెడ్డి. వెస్ట్ డిఎస్పి నర్సప్ప. కమాండ్ కంట్రోల్ డిఎస్పి కొండయ్య. భాకరాపేట సీఐ. తులసిరామ్. ఎస్సైలు వెంకటేశ్వర్లు ప్రకాష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement