Friday, April 26, 2024

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. గూడ్స్ బాలేరో వాహనం నుండి జారి కిందపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరిని హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొదిలి మండలం అక్కచెరువు గ్రామంలో ఓ పెళ్ళికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో వాహనంలో మొత్తం 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ  ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement