Monday, May 6, 2024

నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను ఈ రోజ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జెఎన్‌టియులో విడుదల చేయనున్నారు. ఎంసెట్‌ ఫలితాల్లో భాగంగా అభ్యర్థులు సాధించిన మార్కులు, వారికి వచ్చిన ర్యాంకులను ప్రకటిస్తారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in అనే వెబ్‌ సైట్‌లో కూడా చూడొచ్చు. ఈ ఏడాది తరగతులు, పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్‌ ఫలితాలను ప్రకటించినందున ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజిని తొలగించారు. దాంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులను ఖరారు చేస్తారు.  ఈ ఏడాది ఎంసెట్‌లో 70 నుంచి 80 మార్కులు వస్తే 10 వేల ర్యాంకుకు అటూఇటూగా వస్తుందని అంచనా వేస్తున్నారు. 30వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

కాగా, ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, ఈనెల 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి లక్ష 47 వేల 986 మంది హాజరయ్యారు.

ఇది కూడా చదవండిః కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణేకు బెయిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement