Wednesday, May 8, 2024

రెయిన్ ఎపెక్ట్.. పలు రైళ్ల రాకపోకలు రద్దు..

ప్ర‌భ‌న్యూస్ : రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్స్ పై నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07657/58 నెంబర్‌ గల రేణిగుంట-గుంతకల్‌, గుంతకల్‌-రేణిగుంట రైళ్లు ఈ నెల 20న రద్దయినట్లు తెలిపింది. అలాగే 17622 రేణిగుంట-ఔరంగబాద్‌ ట్రైన్‌ నవంబర్‌ 20న పాక్షికంగా రద్దయినట్లు, 17487/88 కడప-విశాఖపట్నం, విశాఖపట్నం-కడప రైలు కూడా పాక్షికంగా రద్దయినట్లు ప్రకటించింది. అలాగే 12793/94 తిరుపతి-నిజామాబాద్‌, నిజామాబాద్‌-తిరుపతి రైలు నవంబర్‌ 20న పాకల, ధర్మవరం, గూటీ మీదుగా డైవర్షన్‌ చేశారు. అలాగే 12797/98 కాచిగూడ-చిత్తూరు, చిత్తూరు-కాచిగూడ రైలు నవంబర్‌ 20న గూటీ, ధర్మవరం, పాకల మీదుగా ప్రయాణిస్తుంది.

07651/52 చెంగల్‌ప ట్టు-కాచిగూడ, కాచిగూడ-చెంగల్‌పట్టు రైలు రేణిగుంట, గూడురు, తెనాలి, గుంటూరు, పడిగిపల్లి, మౌల-అలి మీదుగా ప్రయాణించును, 17415/16 తిరుపతి-కోల్హాపూర్‌, కోల్హాపూర్‌-తిరుపతి రైలు గూటీ, ధర్మవరం పాకల, కడ్పటీ మీదుగా ప్రయాణించనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య గల వీక్లీ పూజ స్పెషల్‌ ట్రైన్స్‌ని పొడిగించినట్లు రైల్వే శాఖ పేర్కొంది. 08579/80 గల ట్రైన్‌ విశాఖపట్నం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-విశాఖపట్నం నవంబర్‌ 24, 25వ తేదీలలో, 08585/86 గల ట్రైన్‌ విశాఖపట్నం- సికింద్రా బాద్‌, సికింద్రాబాద్‌-విశాఖపట్నం నవంబర్‌ 30వ తేదీన, డిసెంబర్‌ 1 తేదీలలో నడపనుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement