Tuesday, May 14, 2024

Railways | ప్రయాణికులకు అలర్ట్.. భారీగా ట్రైన్ల రద్దు !

రైల్వే ప్ర‌యానికుల‌కు అల‌ర్ట్..! దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. అలాగే మరికొన్నింటి రైళ్ల దారి మళ్లించారు. కాగా, ఏయే రైళ్లు రద్దు అయ్యాయో, ఏయే రైళ్ల రూట్లను మార్చారు అనే వివరాలు ఇవే..

29.01.2024 నుండి 25.02.2024 వరకు మచిలీపట్నం నుండి బయలుదేరే రైలు నెం 17219 మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు అయ్యింది. అలాగే 30.01.2024 నుండి 26.02.2024 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు 17220 విశాఖపట్నం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ క్యాన్సిల్ చేశారు. రైలు నెం. 17239 గుంటూరు- విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ 19.01.2024 నుండి 25.02.2024 వరకు గుంటూరు నుండి బయలుదేరుతుంది.

ఇంకా 20.01.2024 నుండి 26.02.2024 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు 17240 విశాఖపట్నం- గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు అయిపోయింది. 29.01.2024 నుండి 25.02.2024 వరకు కాకినాడ నుండి బయలుదేరే రైలు 17267 కాకినాడ- విశాఖపట్నం రైలు కూడా క్యాన్సిల్ అయ్యింది.

- Advertisement -

అదేసమయంలో 30.01.2024 నుండి 26.02.2024 వరకు విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు 17268 విశాఖపట్నం- కాకినాడ రైలు కూడా రద్దు చేసేశారు. రైలు 22702 విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ జనవరి 19, 20, 22, 23, 24 తేదీల్లో నడవదు.

ఇంకా రైలు 22701 విశాఖపట్నం- విజయవాడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ జనవరి 19, 20, 22, 23, 24 తేదీల్లో నడవదు. అలాగే 29.01.2024 నుండి 25.02.2024 వరకు గుంటూరు నుండి బయలుదేరే రైలు 17243 గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం వద్ద షార్ట్ టర్మినేట్ అవుతుంది.

ఇకపోతే రైలు 17244 రాయగడ- గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలు 30.01.2024 నుండి 26.01.2024 వరకు రాయగడకు బదులుగా విజయనగరం నుండి గుంటూరుకు బయలుదేరుతుంది.

రూట్ మారిన ట్రైన్ వివరాలు ఇవే..

కింద ఇచ్చిన ట్రైన్స్ ఇకపై నిర్దేశిత తేదీల్లో విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.

జనవరి 22, 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో ఎర్నాకులం నుండి బయలుదేరే 22643 ఎర్నాకులం-పాట్నా SF ఎక్స్‌ప్రెస్ మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఇంకా రైలు 12509 ఎస్ఎంవీ బెంగళూరు-గౌహతి ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్.. SMV బెంగళూరు నుండి జనవరి 19, 24, 26, 31, ఫిబ్రవరి 2, 7,9, 14, 16, 21, 23 తేదీల్లో మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

అలాగే రైలు 11019 సీఎస్‌టీ ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ CST ముంబై నుండి జనవరి 19, 29, 31, ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16,17, 19, 21, 23, 24 తేదీల్లో మళ్లించిన దారిలో నడుస్తుంది. ఇంకా స్టాపేజ్ ఏలూరు, తాడేపల్లి గూడెం తొలగించారు.

ఇకపోతే కింది రైళ్లు నిడదవోలు-భీమవరం టౌన్-గుడివాడ-విజయవాడ మీదుగా నడుస్తాయి. 1. 29.01.2024 నుండి 25.02.2024 వరకు ధన్‌బాద్‌లో బయలుదేరే రైలు 13351 ధన్‌బాద్-అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. స్టాపేజ్ తాడేపల్లిగూడెం, ఏలూరు ఉండదు.

అలాగే ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీలలో టాటా నుండి బయలుదేరే రైలు 18111 టాటా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ మళ్లించిన మార్గంలో నడుస్తుంది. దీనికి ఏలూరు స్టాప్ ఉండదు. జనవరి 31, ఫిబ్రవరి 7,14, 21 తేదీలలో జసిదిహ్ నుండి బయలుదేరే రైలు 12376 జసిదిహ్-తాంబరం ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. దీనికి కూడా ఏలూరు స్టాప్ లేదు.

ఇంకా జనవరి 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీలలో హటియా నుండి బయలుదేరే రైలు 22837 హతియా-ఎర్నాకులం AC ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ఏలూరు స్టాప్ లేదు. ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో హటియా నుండి బయలుదేరే రైలు 18637 హతియా-SMV బెంగళూరు ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

రైలు 12835 హతియా-SMV బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హటియా నుండి జనవరి 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీలలో మళ్లించిన దారిలో నడుస్తుంది. ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో టాటా నగర్‌లో బయలుదేరే 12889 టాటా నగర్-SMV బెంగళూరు ఎక్స్‌ప్రెస్ కూడా మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement