Saturday, April 27, 2024

రాజమండ్రిలో పవన్ కల్యాణ్.. శ్రమదానంపై తీవ్ర ఉత్కంఠ

ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమంపై టెన్షన్ కొనసాగుతోంది. అయితే, పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌మండ్రికి ఇప్పటికే చేరుకున్నారు. దీంతో ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో పోలీసులు అడుగ‌డుగున ఆంక్ష‌లు విధించ‌డంతో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. అయిన‌ప్ప‌టికీ శ్ర‌మ‌దానంలో పాల్గొనాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు.

అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే, రాజమండ్రి కాటన్ బ్యారేజీపై శ్రమదానం చేసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ కార్యక్రమాన్ని హుకుంపేటకు మార్చారు. బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహణకు మాత్రం పోలీసులు నిరాకరించారు. రాజమండ్రికి దారితీసే రహదారులన్నింటివద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపిస్తున్నారు.

ఇది కూడా చదవండిః మంజీరా న‌దిలో య‌థేచ్ఛ‌గా ఇసుక మాఫియాః వైఎస్ షర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement