Tuesday, October 26, 2021

‘వరుడు కావలెను’ సాంగ్ రిలీజ్!

యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన మూవీ ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగును మూవీ టీం విడుదల చేసింది. ‘వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు .. వయ్యారం చిందేసే అందాల బొమ్మలు’ అంటూ ఈ పాట సాగుతోంది. విశాల్ చంద్రశేకర్ సంగీతం అందించగా.. రఘురామ్ సాహిత్యం అందించారు. ప్రేమ – పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. సితార ఎంటర్టైమంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News