Tuesday, May 14, 2024

AP | వైకాపాలో చేరిన పలమనేరు తెదేపా నేత సుభాష్ చంద్రబోస్

పలమనేరు (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఆర్‌.వి.సుభాష్‌ చంద్రబోస్‌ ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా సుభాష్‌ చంద్రబోస్‌ పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అమరనాథ్ రెడ్డి 2017 లో తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవి పొందారు.

ఆ సందర్బంగా సుభాష్‌ చంద్రబోస్‌ను బుజ్జగించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎంఎల్సి పదవి ఇస్తానని చెప్పి రాష్ట్ర పార్టీ కార్యవర్గ పదవితో సరిపెట్టారు. ఆ తరువాత 2019 లో అమరనాథ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసినా పార్టీ తగిన విధంగా గుర్తించలేదు. ఇటీవల పలమనేరులో తన వర్గీయలతో సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ తో పూర్తిగా తెగేతెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు.

ఈరోజు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో సుభాష్‌ చంద్రబోస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement