Saturday, April 27, 2024

మంత్రుల సాక్షి గా శిలాఫలకంలో బిసి చైర్మన్ లకు దక్కని చోటు

చిత్తూరు సెప్టెంబర్ 15 (ప్రభ న్యూస్ బ్యూరో). బీసీ భవన్ ప్రారంభంలో బీసీలకు అవమానం జరిగింది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చామంటూ ప్రకటించుకున్న ప్రభుత్వం ఆ వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి
తాజాగా శుక్రవారం చిత్తూరులోబీసీ భవనం ప్రారంభించారు.ఈ శిలాఫలకంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ లకి చోటు కల్పించలేకపోడం బాధాకరమని ఎన్నికైన చైర్మన్లు ఆవేదన చెందారు..


బీసీల పట్ల వైసిపికి చిత్తశుద్ది లేదని చర్చించు కుంటున్నారు. చిత్తూరు జిల్లా నుండి నలుగురు బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్లు ఉన్నప్పటికీఎవరి పేరు ఈ శిలాఫలకంలో లేకపోవడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై విలేఖరులు బీసీ వెల్ఫేర్ ఈడి రబ్బానీ భాషా ను వివరణ కోరగా సమాధానాన్ని దాటవేస్తూ మళ్ళీ మాట్లాడుతానని మీడియాకు బ్రీఫ్ చేసి వెళ్లి పోయారు.

జిల్లా కేంద్రంలోరూ. 4.43 కోట్ల ఖర్చుతో నిర్మించిన మహాత్మా జ్యోతి రావు పూలే నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు ప్రారంభించారు.బిసి భవన్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై స్థానికంగా ఉన్న బిసి కార్పొరేషన్ చైర్మన్ ల పేర్లు లేక పోవడం వివాదానికి కారణం అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement