Wednesday, May 15, 2024

మండపేటలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్తీక తొలి సోమవారం నాగుల చవితి పండుగ రావడం తో విశేష పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. నాగుల చవితిని పురస్కరించుకుని  మండపేట లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోసి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మండపేట మండలం లోని అన్ని గ్రామాల్లోనాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏడిద రోడ్ లోని పావన పేరంటలమ్మ ఆలయం,ఏడిద రోడ్ చంద్రరావు ఫైర్ వర్క్స్, బైపాస్ రోడ్, మారేడు బాక, గుమ్మిలేరు రోడ్,శ్రీ నగర్ కాలనీ  గొల్లపుంత, మరేడు బాక శివారు, పెద్ద కాల్వ, రాజరత్న బైపాస్ రోడ్ ఇలా పట్టణ శివారు ప్రాంతాల్లోని పుట్టల దగ్గర భక్తులు పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం చవితి ఉత్సవాలు చేసుకునేందుకు జనం ఆసక్తి కనబరిచారు. తెల్లవారు జామునుంచే ప్రజలు పుట్టల దగ్గర బారులు తీరారు.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో నిర్వహించే నాగ పూజను భక్తితో నిర్వహించారు. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని భక్తుల నమ్మకం. ఎంతో భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించారు. పుట్టకు పూజ చేసి పండుగ జరుపుకున్నారు. నాగుల చవితివేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామునే తలంటి స్నానం, శుభ్ర వస్త్రధారణ, పూజ సామగ్రితో శివారు ప్రాంతాల్లో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేశారు. ఈ పర్వదిన కార్యక్రమంలో దీపావళినాడు కాల్చగా మిగిలిన టపాసుల్ని నాగుల చవితినాడు వెలిగించి పిల్లలు సంబరపడ్డారు. దంపతులకు సంతానం కలగకపోవడానికి సర్పదోషమే కారణమని భావించినవారు పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సంతానం కలిగిన వారు పుట్టవద్ద బిడ్డను పడుకో పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పంటలు ఏపుగా పెరిగే కాలమైన ‘కార్తిక శుద్ధ చవితి’నాడు‘నాగుల చవితి’ని పర్వదినంగా ఆచరిస్తు పూజలు ఘనంగా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement