Tuesday, May 14, 2024

AP | త్వరలోనే మేనిఫెస్టో.. మాట ఇస్తే త‌గ్గేదే లేదు : జగన్

త్వరలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చేయగలిగిందే చెబుతాం, చెప్పిన ప్రతి ఒక్కటీ చేసి తీరుతామని అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్‌లో జరిగిన నాలుగో సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదని, మేనిఫెస్టోను ఏనాడూ అమలు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు మ్యానిఫెస్టోకు.. శకుని చేతిలోని పాచికలకు తేడాలేదని అన్నారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు కలర్ ఫుల్ మేనిఫెస్టోతో వస్తారని.. ఇలాంటివి నమ్మవద్దని అన్నారు.

చంద్రబాబులా నటించే రాజకీయ స్టార్ క్యాంపెయినర్లు తనకు లేరని.. అబద్ధాలు చెప్పే ఎల్లో మీడియా తనకు లేదని అన్నారు. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు. పేదల భవిష్యత్తుపై చంద్రబాబు దాడికి దిగుతారన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పార్టీలు ఇప్పుడు బాబు వెంటే ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. నేరుగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక‌ ఢిల్లీకి వెళ్లి పొత్తులు పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబు జీరో అని, ఎన్ని బోడి పార్టీలు కలిసినా ఆయన విలువ సున్నా అని సెటైర్లు వేశారు. ఇంటింటికీ జగన్ చేస్తున్న అభివృద్ధి చంద్రబాబులో భయం కలిగిస్తోందన్నారు.

2024 ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 8 పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది అని అన్నారు. 66 లక్షల పింఛన్లకు రూ.24 వేల కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సబ్సిడీ కింద బియ్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం రూ.4,600 కోట్లు, ఆరోగ్యశ్రీ, 104, 108 అమలు చేయాలి. మరో రూ.4,400 కోట్లు, విద్యా దీవేన, వసతి దీవేన కింద రూ.5,000 కోట్లు, సంపూర్ణ పోషణ కింద రూ.2,200 కోట్లు, గోరుముద్ద కింద మరో రూ.1900 కోట్లు.. ఈ 8 పథకాలను ఎవరూ టచ్ చేయలేరని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలకు మొత్తం రూ.52,700 కోట్లు ఖర్చవుతుందని సీఎం జగన్ తెలిపారు.

మేనిఫెస్టోలో 90 శాతం అమలు చేశాం, పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి మేలు చేశామని, రాష్ట్రంలోని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఇంటికి మేలు చేశామన్నారు. ప్రతి గ్రామంలో మంచి పనులు జరిగాయని, ప్రతి గ్రామానికి రూ.20 కోట్లు నేరుగా చేరాయని, అందుకే వై నాట్175, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీని కూడా తగ్గించకూడదన్నారు. కరోనా కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలను అందజేశామన్నారు. ఒక్క బటన్ నొక్కితే నేరుగా అక్కాచెల్లెళ్ల ఖాతాల్లోకి 2 లక్షల 65 వేల కోట్లు జమ అయ్యాయి అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement