Sunday, April 28, 2024

WPL | దంచికొట్టిన ఢిల్లీ.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో భాగంగా ఇవ్వాల జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్స్ మరోసారి ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ దంచికొట్టడంతో.. ఆర్సీబీ ముండు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఢిల్లీ బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ (58), అలిస్ క్యాప్సీ (48) ధీటుగా ఆడారు. ఢిల్లీ ఓపెనర్లు మెగ్ లానింగ్ (29), షఫాలీ వర్మ (23) ఫర్వాలేదనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement