Sunday, October 6, 2024

ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య

కర్నూలు : ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూల్ నగరంలో చోటు చేసుకుంది. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌ సీఐ శంకరయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఉల్చాల రోడ్డు సమీపంలో ఉన్న వసుంధర అపార్టుమెంట్‌లో సువర్ణ కుమారి(44) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కడప జిల్లాకు చెందిన జేమ్స్‌, సువర్ణ ఇరువురు భార్యభర్తలు. వీరికి ఒక కూతురు సంతానం. సువర్ణ కుమారి గత కొద్ది కాలంగా ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రశాంత్‌ కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తూ ఉల్చాల రోడ్డులో వసుందర అపార్టుమెంటులో నివాసముంటున్నారు. కూతురు చదువు కోసం సువర్ణ కుమారి ఈ నెల 13వ తేదీన కర్నూలు వచ్చింది. వసుంధర అపార్టుమెంట్‌లో నివాసముంటున్న ప్రశాంత్‌ ఇంటికి ఆదివారం వచ్చింది. ప్రశాంత్‌ ఇంట్లో లేని సమయంలో బుధవారం సువర్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి భర్త జేమ్స్‌కు సమాచారం అందించారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement