Sunday, May 19, 2024

ఎపిలో ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్ ‘స్వాభిమాన్‌’ ఏర్పాటు

అమరావతి,ఆంధ్రప్రభ: ట్రాన్స్‌ జెండర్ల సమస్యల పరి ష్కారం కోసం ప్రభుత్వ ఆదేశాలతో సీఐడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌కు ‘స్వాభిమాన్‌’ అనే నామకరణం జరిగింది. ట్రాన్స్‌జెండర్ల రక్షణకు వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ‘1091’ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బుధవారం ప్రారంభించారు. ఈ హెల్ప్‌లైన్‌ పని తీరుపై సీఐడి రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ట్రాన్స్‌ జెండర్‌లను హేళన చేయడం, వారిని అవమానించడం, వారి వైకల్యాన్ని రాజకీయ పరిభాషలో ఎదుటివారిని తిట్టడానికి ఉపయోగించడం చాలా బాధాకరం అన్నారు. ట్రాన్స్‌ జెం డర్‌ల భద్రతకు, రక్షణకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. వీరు కూడా ప్రేమ పేరుతో మోసపోవడం దీంతో చాలా మంది ఆత్మహత్యలు, హత్యలకు గురవుతున్నారన్నారు. వాటిని నిరో ధించేందుకు స్వాభిమాన్‌ దోహద పడుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్‌ లకు కూడా ఆత్మాభి మానం ఉంటు-ందని అందుకే ఈ హెల్ప్‌లైన్‌ పేరు ను ‘స్వాభిమా నం’గా నామకరణం చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్‌జె ండర్లు ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేప డుతుందన్నారు. రాష్ట్ర స్ధాయి ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ నోడల్‌ అధికారి, సీఐడి ఎస్పీ కెజీవి సరి త మాట్లాడుతూ స్వాభిమాన్‌ ద్వారా ట్రాన్స్‌జెండర్స్‌ ఫిర్యా దులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సీఐడి పని చేస్తుందని తెలిపారు. కౌన్సిలింగ్‌తోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవ డం జరుగుతుందన్నారు. సిఐడి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు మా ట్లాడుతూ ట్రాన్స్‌జండర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న సంక్షేమ పథకాల వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement