Wednesday, April 14, 2021

సంప్రదాయ కళకు సముచిత గౌరవం..

క‌ర్నూలు – సమాజంలో అత్యంత ప్రభావితమైన కలగా ఉన్న డప్పు కు ప్రాధాన్యతనిస్తూ డప్పు కళాకారులు అందరికీ డప్పు గజ్జలు దుస్తులు ఇచ్చి సాంప్రదాయ కళకు ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పించిందని కర్నూలు ఏ ఎస్ డబ్ల్యూ ఓ రవీంద్రనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు తెలియజేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని బి క్యాంప్ లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ మహిళా హాస్టల్ లో కర్నూలు కల్లూరు గూడూరు సి.బెళగల్ మండలాలకు చెందిన డప్పు కళాకారులకు డప్పు గజ్జలు డ్రస్సులు అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ మద్దిలేటి, సీనియర్ అసిస్టెంట్ లు ప్రకాష్, విజయ్ కుమార్ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సందె పోగు సత్యం జిల్లా నాయకులు నల్లగోటి చక్రపాణి, నాయకంటి నాగరాజు, బతకన్న, చంద్రశేఖర్, చిన్న రాముడు, చిన్న మాదన్న, వెంకటేశ్వర్లు, చిరంజీవి, మల్లె పోగు లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News