Wednesday, April 14, 2021

కత్రీనాకు కరోనా… మిగిలిన వాళ్ళు జాగ్రత్త

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అలియాభట్ ,విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ తదితరులు కరోనా బారిన పడ్డారు. కాగా తాజాగా కత్రీనా కైఫ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. మెడికల్ టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లానని వైద్యుల సలహాల మేరకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది.

ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని… ప్రతిఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News