Friday, May 17, 2024

కార్యాలయ భవనాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్

నంద్యాల జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాల కోసం గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు కార్యాలయ భవనాలను పరిశీలించారు. అంతకుమునుపు నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అందులో భాగంగా నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ పాత బంగ్లా, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి ఘనికృత వీర్య కేంద్రం, రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, నీటిపారుదల శాఖ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, విక్టోరియా రీడింగ్ రూమ్, నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం భవనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా భవనాల పరిసర ప్రాంతాలు ఎన్ని ఎకరాలు, ఎన్ని భవనాలున్నాయి వంటి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో బెంగాల్ గ్రామ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి వెరైటీ రీసెర్చ్ గురించి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎంసీ వెంకటేశ్వర్లును జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, నంద్యాల తహసీల్దార్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement